![]() |
![]() |

శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ బ్యూటీ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ఇన్స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ పిక్స్ ని పెట్టుకుంది. శుభశ్రీ ఎంగేజ్మెంట్ చేసుకున్నది అజయ్ మైసూర్ తో. అతను ఎవరో కాదు మూవీ ప్రొడ్యూసర్ కం యాక్టర్. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి మూవీస్ లో నటించాడు. అలాగే "హ్యాంగ్మాన్" అనే ఒక అప్ కమింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. వీళ్ళిద్దరూ కనాలి "మెజెస్టీ ఇన్ లవ్" అనే కవర్ సాంగ్ లో కలిసి నటించారు. ఇక శుభశ్రీ ఒడిశాకి చెందిన అమ్మాయి..బిగ్ బాస్ సీజ 7 కంటెస్టెంట్ గా బాగా పాపులర్ అయ్యింది. ఇక బుల్లితెర నటులంతా కూడా విషెస్ చెప్తున్నారు. ఇక శుభశ్రీ గురించి చెప్పాలి అంటే బిఎల్ చదివింది.
లాయర్ గా కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మూవీస్ లో నటించడానికి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. అలాగే విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ ని సొంతం చేసుకుంది. అలాగే రుద్రవీణ, కథ వెనక కథ వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. యాంకర్ గా కొన్ని షోస్ నిర్వహించింది. కొన్ని మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. కళ్యాణ్ రామ్ నటించిన "అమిగోస్" మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. శుభశ్రీ మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఈమె కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. 2016 లో "అ" అనే మూవీతో పాటు "ఉట్రన్" అనే తమిళ్ మూవీలో కూడా నటించింది.
![]() |
![]() |